మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:21 IST)

అఖిల్ సరసన రష్మిక.. డైరక్టర్ ఎవరో తెలుసా? (video)

''బొమ్మరిల్లు'' భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో అఖిల్ హీరోగా నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట సాగుతోంది. ఇందులో అఖిల్ సరసన రష్మిక మందనను ఎంపిక చేసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 
 
రష్మిక.. అఖిల్ సరసన నటిస్తే ఇక ఆ సినిమాకు యమా క్రేజ్ వస్తుందని.. దీంతో వరుసగా మూడు సినిమాలు ఫట్ అయిన తరుణంలో.. అఖిల్ ఖాతాలో హిట్ పడుతుందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.  
 
ఇంకా యూత్‌లో గీత గోవిందం సినిమా ద్వారా రష్మికకు క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఇక యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా థియేటర్స్‌కి రప్పించే కంటెంట్‌ను భాస్కర్ సిద్ధం చేసుకున్నాడు. 
 
ఫలితంగా అఖిల్‌కి తొలి హిట్ ఇవ్వాలనే పట్టుదలతో వున్నాడు. ఇదే కనుక వెండితెరపై పడితే అఖిల్ ఖాతాలో హిట్ ఖాయం. ఇక మే నెలలో ఈ సినిమా ప్రారంభం కానుందని.. ఆపై వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాక్.