సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (13:11 IST)

శింబు-త్రిష పెళ్లి పీటలెక్కడం ఖాయమేనా? అందుకే అలా జరుగుతోందా? (video)

కోలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ప్రేమ పెళ్లి త్వరలో జరుగనుందని టాక్ వస్తోంది. చెన్నై చంద్రం త్రిష పెళ్లి వ్యవహారానికి సంబంధించిన వార్తే అది. త్రిష పెళ్లికి లిటిల్ సూపర్ స్టార్, నయనతార మాజీ ప్రియుడు శింబు అడ్డుగోడగా వున్నాడట. తమిళ చిత్ర పరిశ్రమలో గత కొద్దికాలంగా త్రిష కృష్ణన్, శింబు పెళ్లి వార్తలు జోరందుకొన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు వెలుగులోకి వచ్చిన రూమర్లపై ఎవరూ పెదవి విప్పడం లేదు. 
 
కానీ త్వరలోనే త్రిష, శింబు వివాహం చేసుకోవడం ఖాయమనే వాదనను సినీ వర్గాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరి పెళ్లి విషయంపై శింబు తండ్రి ప్రవర్తన, తీరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవలే శింబు తండ్రి, ప్రముఖ దర్శకుడు టి.రాజేందర్‌ ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొనగా ఈ ప్రశ్న ఎదురైంది. దీనిపై రాజేందర్ ఏం సమాధానం చెప్పకుండా దాటవేశారు. 
 
శింబు, త్రిష పెళ్లి వార్తను ఆయన కొట్టిపారేయకుండా దాటవేశారంటే ఈ వార్త నిజమేనని సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో వారిద్దరు త్వరలోనే పెళ్లి పీటలెక్కడం ఖాయమని చెబుతున్నారు. త్రిష, శింబు తమ కెరీర్ తొలినాళ్లలో "విన్నైతాండి వరువాయ" ( ఏమాయ చేశావే తమిళ్‌ వెర్షన్‌), అలై చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో హిట్ పెయిర్‌గా నిలిచారు.
 
కాగా లాక్ డౌన్ సమయంలో త్రిష-శింబు కలిసి కార్తీక్ డయల్ సైద యెన్ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. ఇప్పటికే ఈ ఏడాది డిసెంబరులో ఓ శుభవార్త చెప్తానని శింబు ప్రకటించారు. దీంతో త్రిష-శింబు రిలేషన్‌లో వున్నారని.. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.