ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (12:57 IST)

రెజీనాతో సాయిధరమ్ తేజ్ వివాహం.. వచ్చే ఏడాదే ముహూర్తం.. పవన్‌ రూటులో?

ఏ మాయ చేసావె సినిమా ద్వారా ప్రేమపక్షులుగా మారిన టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంత అక్టోబర్‌లో వివాహ బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. తాజాగా మరో ప్రేమ జంట కూడా సమంత, చైతూలా వివాహం చేసుకునేంద

ఏ మాయ చేసావె సినిమా ద్వారా ప్రేమపక్షులుగా మారిన టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంత అక్టోబర్‌లో వివాహ బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. తాజాగా మరో ప్రేమ జంట కూడా సమంత, చైతూలా వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వాళ్లెవరంటే.. రెజీనా, సాయిధరమ్ తేజ్. వీరిద్దరూ ఎప్పటి నుంచో పీకల్లోతు ప్రేమలో వున్నారని.. త్వరలో వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. 
 
ఇప్పటికే టాలీవుడ్‌లో తనతో నటించిన జీవితను రాజశేఖర్, అమలను నాగార్జున పెళ్లి చేసుకొని చక్కటి వైవాహిక జీవితం గడుపుతున్నారు. ఇలాంటి హీరోలు యువతరానికి ఆదర్శంగా నిలిచారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తనతో నటించిన రేణూ దేశాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. అయితే వారిద్దరూ విడిపోయినా.. వారి మధ్య సంబంధాలు కొనసాగుతూనే వున్నాయి. 
 
ఇదే బాటలో అంటే ప్రేమ పెళ్లి విషయంలో పవన్ కళ్యాణ్ దారిలోనే ఆయన ముద్దుల మేనల్లుడు సాయిధరమ్ నడుస్తున్నట్లు సమాచారం. స్టార్ హీరోయిన్‌ రెజీనాతో సాయి ధరమ్ తేజ్ అఫైర్ పెళ్లి వరకు వచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. పిల్లా నువ్వు లేని జీవితం సినిమా సందర్భంగా రెజీనా, సాయిధరమ్ తేజ్‌ల మధ్య ప్రేమ చిగురించిందట. వారిద్దరూ కలిసి నటించిన రెండో సినిమా ''సుబ్రమణ్యం ఫర్ సేల్" షూటింగ్ సమయంలో ఇద్దరూ మరింత దగ్గరయ్యారట. దీంతో రెజీనా, సాయిధరమ్ ప్రేమించుకుంటున్నారని వార్తలొచ్చాయి. 
 
అయితే ఈ వార్తల్లో నిజం లేదని రెజీనా దాచేందుకు ప్రయత్నించింది. కానీ సాయిధరమ్ మాత్రం ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. పెద్దలు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే తెలుస్తోంది. అయితే రెజీనా మాత్రం ఇప్పటికిప్పుడే పెళ్లి వద్దని, కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని కొద్దిరోజులు ఆగుదామనే ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. కానీ సాయి మాత్రం త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడట.