Daily Horoscope
✕

బాలీవుడ్ అరంగేట్రం.. సాయిపల్లవికి బంపర్ ఆఫర్

Written By సెల్వి
Updated: శుక్రవారం, 18 జూన్ 2021 (12:25 IST)
ఫిదా భామ సాయిపల్లవి బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసే నాయికలకు బాలీవుడ్‌ సాదర స్వాగతం పలుకుతోంది. ఇందులో భాగంగానే రష్మిక మందన్న మాదిరిగానే సాయిపల్లవికి కూడా ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కిందని సమాచారం. 
 
ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను చాలా గుట్టుగా ఉండేలా నిర్మాణ సంస్థ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో ఈ సినిమాలో సాయిపల్లవి ఏ స్టార్‌కి జోడీగా నటించనుంది?, దర్శకుడు ఎవరు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభించలేదు. 
 
అయితే ఈ సినిమాతో సాయిపల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ మాత్రం ఖాయమన్నట్టు తెలుస్తోంది. సాయి పల్లవి నటించిన 'లవ్‌ స్టోరి', 'విరాట పర్వం' చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అలాగే నాని 'శ్యామ్‌ సింగ రాయ' చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది.

అన్నీ చూడండి

ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో అసాధారణ లక్ష్యాన్ని ఛేదించిన స్పేస్ఎక్స్

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో రూ.23 కోట్ల నిధులు స్వాహా

మైక్రోఫోన్ ఆపేశారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిందులు... (Video)

పెళ్లి పేరుతో ముంబై మహిళా వ్యాపారవేత్త వద్ద రూ.5 కోట్లు మోసం

మహిళా టీచర్‌ను బెదిరించి ఫొటోలను అశ్లీలంగా చిత్రీకరించి బెదిరించిన వ్యక్తి...

అన్నీ చూడండి

బ్రిటిష్ పోషకాహార శాస్త్రాన్ని భారతదేశానికి పరిచయం చేస్తూ, షిఫ్ట్‌లైఫ్ యాంటీ-స్పైక్ డైలీని ఆవిష్కరించిన మోడికేర్

శక్తినిచ్చే 8 ఆహార పదార్థాలు, ఏంటవి?

బ్రౌన్ రైస్ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

చెన్నై రేలా ఆస్పత్రిలో అన్నవాహికకు అరుదైన చికిత్స - తమిళనాడులోనే తొలిసారి

ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు

తర్వాతి కథనం
Show comments