శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2023 (17:11 IST)

సాలార్ రాకతో యానిమల్ వసూళ్ళ స్పీడ్ కు బ్రేక్ పడినట్లే!

salar hit poster
salar hit poster
గత రెండు వారాలుగా పాన్ ఇండియా సినిమాల్లో యానిమల్ కు ఊహించని కలెక్లన్లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 900 కోట్ల నుంచి వెయ్యి కోట్ల వసూళ్ళు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తూ వుంది. దర్శకుడు సందీప్ వంగా తమ సినిమాపై చూపుతున్న కలెక్లన్లకు ఖుషీఅవయిపోయారు.  ఇప్పుడు షారూఖ్ ఖాన్ దంకీ సినిమా కొద్దిగా ఆ కలెక్లస్లను బ్రేక్ చేయగా, నేడు విడుదలైన సలార్ పూర్తిగా బ్రేక్ చేసినట్లయింది.
 
యానిమల్ లో పర్వర్టెడ్ పిచ్చివాడిగా సైకోగా రణబీర్ కపూర్ నటించి శ్రుంగార సన్నివేశాల్లో పాల్గొని అడల్ట్ మూవీగా మార్చేశాడు. ఇక దంకీ మాత్రం కొంతమందికి కనెక్ట్ అయ్యే సినిమాగా మారింది. ఈరోజు విడుదలైన  ప్రభాస్ సలార్ పూర్తిగా బ్రేక్ చేసింది. విడుదలైన అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్లన్లతో దూసుకుపోతుంది. హైదరాబాద్ లోని ఐమాక్స్ లో తెల్లవారు జామున 4 గంటల షోకే అభిమానులు క్యూలు కట్టారు.  ఈ రోజు అన్ని షోలు పూర్తిగా బుక్ అయ్యాయని నిర్మాతలు చెబుతున్నారు. ఇదే రీతిలో యావత్ ఇండియాలోనూ ఇతర ప్రాంతాల్లోనూ వుందనే సంకేతాలు చూపిస్తూ సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ పోస్టర్ తయారుచేశారు. ప్రభాస్ మానియా ఎన్ని రోజులు వుంటుందో చూడాలిమరి.