శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (19:19 IST)

సమంత.. మళ్లీ ఆ డైరెక్టర్‌తో సినిమా చేస్తుందా..? (Video)

సమంత.. నందినీ రెడ్డి.. వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ఓ.. బేబి. కొరియన్ మూవీ రీమేక్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్‌లో సైతం రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ గురించి అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు. 
 
ఇదిలా ఉంటే.. సమంత న్యూ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... సోనీ పిక్చ‌ర్స్ సంస్థ‌కు ఓ సినిమా చేయ‌డానికి అంగీక‌రించింది స‌మంత‌.
 
 ఈ మూవీకి అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకి క‌థంతా రెడీ అయ్యింది. అయితే... ఈ సినిమా డైరెక్టర్ ఊహించని విధంగా తప్పుకున్నాడట. ఆ బాధ్య‌త నందిని రెడ్డి చేతిలో పెట్టారని టాక్ వినిపిస్తోంది‌. 
 
వెంట‌నే... ఈ కాంబినేషన్ సెట్స్ ‌పైకి తీసుకెళ్ల‌బోతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చ‌ర్స్‌. అయితే... ఇది ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్ అని.. ఇందులో ప్రతిసీన్ థ్రిల్ కలిగిస్తుందని టాక్. అయితే.. క‌థ అశ్విన్‌దే. డైరెక్ష‌న్ మాత్రం నందిని రెడ్డి చేయనున్నారు. విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటున్న సమంత ఈసారి హార‌ర్‌ని ఎంచుకుంది.
 
హర్రర్ జోనర్ అటు సమంతకు ఇటు నందినీ రెడ్డికి కొత్తే. మరి.. ఈ సక్సస్‌ఫుల్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఏం చేస్తారో చూడాలి.