శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 9 అక్టోబరు 2020 (18:05 IST)

సమంత అంత హాట్‌గా ఏ హీరోయిన్ వుండదు: రాజ్ తరుణ్ కామెంట్స్

రాజ్ తరుణ్.. ఉయ్యాలా జంపాలా, కుమారి 21 ఎఫ్‌, సినిమా చూపిస్త మామ చిత్రాలతో వరుస విజయాలు సాధించి యూత్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడం వలన కెరీర్లో వెనకబడ్డాడు. రీసెంట్ ఓరేయ్ బుజ్జిగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ.. ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు. అందుకని ఇక నుంచి ఆచితూచి కథలు ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యాడని తెలిసింది. 
 
ఇదిలాఉంటే.. రాజ్ తరుణ్ తన ఫేవరేట్ హీరో, హీరోయిన్ గురించి తన మనసులో మాటలను బయటపెట్టాడు. ఇంతకీ మేటర్ ఏంటంటే... రాజ్ తరుణ్ ఫేవరెట్ హీరో మహేష్ బాబు. మహేష్ అంటే చిన్నప్పట్నుంచి రాజ్ తరుణ్‌కు ఎంతో ఇష్టమట. సినిమాల్లోకి వచ్చి హీరోగా రెండు సినిమాలతో సక్సెస్ సాధించిన తర్వాత కూడా మహేష్ బాబును కలవాలని తెగ ప్రయత్నించాడట ఈ కుర్ర హీరో.
 
ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు స్వయంగా రాజ్ తరుణ్‌ను తన సెట్స్‌కు పిలిపించుకున్నాడట. అది ఏ సినిమా సెట్స్‌కి అంటారా..? బ్రహ్మోత్సవం. ఈ సినిమా సెట్లో మహేష్ బాబును తొలిసారి కలిశానని చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. ఇక అసలు విషయానికి వస్తే... ఫేవరేట్ హీరో మహేష్ బాబు అయితే.. ఫేవరేట్ హీరోయిన్ సమంత.
 
అవును.. తన ఫేవరేట్ హీరోయిన్ సమంత అని.. ఆమె నటించిన అన్ని సినిమాల్ని చూసేసానన్నాడు రాజ్ తరుణ్. ఇప్పుడున్న హీరోయిన్లలో సమంత అంత హాట్‌గా తనకు ఎవ్వరూ కనిపించరని కామెంట్ చేసాడు. మరి.. రాజ్ తరుణ్ హాట్ కామెంట్స్ పైన సమంత స్పందిస్తుందేమో చూడాలి.