శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (17:26 IST)

సమంత, చైతూల మధ్య విబేధాలు.. పేరెందుకు మార్చుకుంది.. నాగ్ బర్త్ డేకు..?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా పేరు సంపాదించిన సమంత.. పెళ్లికి తర్వాత కూడా అదే ఊపులో కొనసాగుతోంది. తాజాగా కొన్ని రోజులుగా సమంతపై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె సోషల్ మీడియాలో పేరు మార్చుకోగా, చైతు, నాగ్‌లతో విబేధాలే కారణం అంటూ ప్రచారం సాగుతుంది. నాగ్ బర్త్ డే వేడుకలలో సమంత లేకపోవడం, ఈ అనుమానాలు మరింత పెంచేశాయి. 
 
కాగా సోషల్ మీడియాలో తాను పేరెందుకు మార్చుకున్నారనే విషయంపై సమంత ఈ విధంగా స్పందించారు. సమంత సామాజిక మాధ్యమాల్లో పేరెందుకు మార్చుకుంది? ఈ విషయం నెట్టింట హాట్‌ టాపిక్‌ అయింది. ట్రోల్స్‌ వస్తున్నాయి. 
 
దానిపై స్పందించాలని నేను అనుకోవడం లేదు. ఇప్పుడే కాదు ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2 విడుదలైన సమయంలోనూ విమర్శలు ఎదురయ్యాయి. దీని గురించి ఏదైనా చెప్పండి అంటూ కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా కోరారు. 
 
ఇందుకు సుమారు 65,000 ట్వీట్లు పెట్టారు. కానీ, నాకు జవాబు ఇవ్వాలనిపించలేదు. సంబంధిత విషయాలపై నాకు మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతా. అని అసలు కారణం బయటపెట్టకుండానే విషయం ముగింసింది.