గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 14 జులై 2017 (17:05 IST)

ఆహారం-శృంగారం రెండింటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేయడం కష్టం.. సమంత చిట్ చాట్ (వీడియో)

టాలీవుడ్ టాప్ హీరోయిన్.. అందాల నటి.. అక్కినేని వారి కాబోయే కోడలు సమంత జేఎఫ్‌‍డబ్ల్యూ మేగజీవ్ కోసం అందాలను ఆరబోసిన సంగతి తెలిసింది. ఇందులో కోసం నిర్వహించిన ఫోటో షూట్‌ సందర్భంగా చిన్న చిట్ చాట్ జరిగింది

టాలీవుడ్ టాప్ హీరోయిన్.. అందాల నటి.. అక్కినేని వారి కాబోయే కోడలు సమంత జేఎఫ్‌‍డబ్ల్యూ మేగజీవ్ కోసం అందాలను ఆరబోసిన సంగతి తెలిసింది. ఇందులో కోసం నిర్వహించిన ఫోటో షూట్‌ సందర్భంగా చిన్న చిట్ చాట్ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో సమంత బోల్డ్‌గా మాట్లాడింది. ఆహారం-శృంగారం ఈ రెండింటిలో ఏది లేకపోతే ఉండలేరనే ప్రశ్నకు సమంత షాకింగ్ సమాధానం ఇచ్చింది. వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేయడం కష్టమని.. కానీ శృంగారం లేకుండా ఏ రోజూ ఉండలేనని బోల్డ్‌గా యాన్సర్ ఇచ్చింది. ఈ సమాధానం విన్న సమంత ఫ్యాన్స్ షాక్ అయ్యారు. 
 
తన హ్యాండ్ బ్యాగులో పెర్ఫ్యూమ్, లిప్‌స్టిక్, ఫోన్.. చిన్న నోట్‌బుక్ వుంచుకుంటానని సమ్మూ చెప్పింది. తాను చేయాల్సిన పనులను మర్చిపోకుండా ఉండేందుకు నోట్ బుక్‌లో అన్నీ రాసుకుంటుంటానని తెలిపింది. చైతన్య చాలా రొమాంటిక్ అంటూ వెల్లడించింది. అతను కొనిచ్చిన భారీ ఖరీదైన డియో బ్యాగు తన ఫేవరేట్ అంది. అతనిలో స్థిరత్వం తనకు నచ్చిందని చెప్పుకొచ్చింది. తన నిశ్చితార్థం చీర తన స్నేహితురాలు డిజైన్ చేసిందని.. ఆమె క్రియేటివిటీ తనకు ఎంతో నచ్చుతుందని తెలిపింది.
 
చైతూతో తనకు మొదటి సినిమా 'ఏం మాయ చేశావో'తో నుంచి చైతూ ప్రేమలో ఉన్నానని, మధ్యలో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నా.. ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతున్నామని సమంత చెప్పింది. నిశ్చితార్థం చీర ద్వారా చైతూ తన ప్రేమాయణం ప్రజెంట్ చేయడమే బెస్ట్ అనుకున్నానని.. ముందు డాక్యుమెంటరీ చేయాలనుకున్నట్లు సమంత వెల్లడించింది.