శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (23:36 IST)

రణబీర్ కపూర్‌ను ఊ అంటావా మావ అంటోన్న సమంత?

Pushpa
అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగ దర్శకత్వంలో బాలీవుడ్‌లో యానిమల్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండాలని డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. 
 
ఈ పాట హిందీతో పాటు సౌత్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ఉండాలని డైరెక్టర్ సందీప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఐటమ్ సాంగ్ లో చేయడం కోసం ముందుగా చిత్రబృందం పూజా హెగ్డేను తీసుకోనున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 
 
అయితే తాజాగా పూజ స్థానంలో సమంత పేరు వినపడుతోంది. ఇప్పటికే ఐటమ్ సాంగ్ ద్వారా ఎంతో క్రేజ్ ఏర్పరచుకున్న సమంత మరోసారి రణబీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాలో సందడి చేస్తే ఆమె క్రేజ్ మామూలుగా పెరగదని సినీ పండితులు అంటున్నారు. ఈ పాట ఆమె రేంజే మారిపోతుందని వారు జోస్యం చెప్తున్నారు. 
 
మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది.