Daily Horoscope
✕

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

Written By సెల్వి
Updated: ఆదివారం, 23 జూన్ 2024 (13:04 IST)
Samantha to romance Shah Rukh Khan
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కి హీరోయిన్ సమంత చాలా పెద్ద ఫ్యాన్. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్‌ మరో సినిమా చేయబోతున్నారట. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇదే నిజమైతే రాజ్‌కుమార్ హిరానీతో సమంతకి ఇదే తొలి సినిమా అవుతుంది. షారుఖ్ ఖాన్‌కి మాత్రం ఇది హిరానీతో రెండో చిత్రం. గతేడాది వీరి కాంబోలో వచ్చి 'డంకీ' చిత్రం మంచి హిట్ అయింది. 
 
ఈ భారీ మూవీకి ఇంకా టైటిల్‌ని ఖ‌రారు చేయాల్సి ఉంది. షారూఖ్ బ్యాక్ టు బ్యాక్ హిరాణీతో క‌లిసి ప‌ని చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. షారుఖ్ త‌దుప‌రి సుహానాతో క‌లిసి కింగ్ అనే మాఫియా నేప‌థ్య‌ చిత్రంలో న‌టించాల్సి ఉంది. స‌మంత న‌టించిన సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్ హ‌నీబ‌న్ని విడుద‌ల కావాల్సి ఉంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అన్నీ చూడండి

బ్రజ్ అభివృద్ధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.18 కోట్ల విరాళం

గోవర్థన గిరి ప్రదక్షిణ చేసిన అనంత్ అంబానీ.. వారిద్దరి ఆశీస్సులతోనే...

బెంగుళూరు నుంచి ఏపీలో ఓటు వేయడానిక వస్తూ మృత్యువాత

తల్లిదండ్రులు చంపాలని చూస్తే... చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న బాలిక

ఏపీలో రెండో దశ పంచాయతీ పోరు - సాయంత్రానికి ఫలితాలు

అన్నీ చూడండి

చీజ్ పఫ్‌తో ఆరోగ్య సమస్యలు... ఏంటవి?

శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్

ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్

కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?

నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట

తర్వాతి కథనం
Show comments