Daily Horoscope
✕

ర‌వితేజ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Written By శ్రీ
Updated: గురువారం, 31 అక్టోబరు 2019 (20:26 IST)
మాస్ మహారాజా రవితేజ 66వ సినిమాను దీపావళి సందర్భంగా ఈమధ్యే ప్రకటించారు. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. డాన్ శీను, బలుపు లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించబోతున్నారు. 
 
2017లో తెలుగు సినిమాలో నటించారు శృతి హాసన్‌. ఇప్పుడు రవితేజ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నారని చెబుతోంది చిత్ర యూనిట్. రవితేజ, శృతి హాసన్ కలిసి నటించబోయే రెండవ సినిమా ఇది. బలుపులో ఇప్పటికే ఓసారి నటించారు ఈ జోడీ. ఆ సినిమాను కూడా గోపీచంద్ మలినేని తెరకెక్కించడం విశేషం. ఆ సినిమా మంచి విజయం సాధించింది. 
 
ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి కథను సిద్ధం చేస్తున్నారు దర్శకుడు గోపీచంద్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పవర్‌ఫుల్ పోలీస్ కథతో వస్తున్నారు గోపీచంద్ మలినేని. బి మధు ఈ చిత్రానికి నిర్మాత. నవంబర్‌లో సినిమా ఓపెనింగ్ జరగనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

అన్నీ చూడండి

రోజాకు బిగ్ షాక్: నగరి తెదేపా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం

మడకశిర జనసేన చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, రాజంపేట తెదేపా చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం?

యేసుక్రీస్తు శిలువ శిరస్సు పైన పడింది, ఫాదర్ స్పాట్ డెడ్, వీడియో

కోల్‌కతా దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాట- రూ.25లక్షలు.. అర్హత గల సభ్యునికి ఉద్యోగం

హైదరాబాద్‌లో హనీట్రాప్ కేసు - యువతిలా నటిస్తూ పోలీసులకే టోకరా

అన్నీ చూడండి

అత్తి పండ్లను ఎందుకు తినాలో తెలుసా?

అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు

45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు

విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?

తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments