ఆ వేడుక మెగాస్టార్‌కు సవాల్‌లాంటిదే!
రాజకీయాలనుంచి సినిమాలకు వచ్చి బిజీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు నటి్స్తూనే మరోవైపు కొత్తతరం హీరోలను, దర్శకులను అభినందిస్తూ ఉత్సాహపరుస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన సోదరుడు ఫంక్షన్‌ను కూడా తన భుజాలపై వేసుకున్నారు. సోదరుడు పవన్‌కళ్యాణ్ సినిమా వకీల్‌సాబ్ ప్రీరిలీజ్ ఫంక్షన్ ఈనెలలోనే జరగనుంది. దానికి అనుగుణంగా హైదరాబాద్‌లో వేదిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం పవన్ సినిమాకే ఆయనే గెస్ట్ అనుకున్నారు. కానీ మెగాస్టార్ వస్తేనే కళగా వుంటుంది. లేదంటే అభిమానులనుంచి పలు ప్రశ్నలకు తలెత్తుతాయి. కనుక మెగాస్టార్‌ను నిర్మాత దిల్‌రాజు ఆహ్వానించారు. ఆయనతోపాటు రామ్‌చరణ్‌కూడా రాబోతున్నాడు.
ఇదిలా వుంటే, గతంలో రామ్‌చరణ్ సినిమా వేడుకలకు చిరంజీవి హాజరయితే పవన్‌కళ్యాన్ రాకపోవడంతో అభిమానులు పవన్ ఏడీ, ఎక్కడ.. అంటూ హడావుడి చేసేవారు. అయితే ఈసారి మరో సమస్య తలెత్తుందని మెగాస్టార్‌కు పలువురు సూచనలు చేశారు. ఇప్పటికే వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీకి మద్దతు తెలపడంతో అది పెద్దగా సినిమా వేడుకలో చర్చ రాదు. కానీ ఎన్నికలు, పవన్ కళ్యాణ్ జనసేనకు ఎటువంటి సపోర్ట్ చేస్తారు. పార్గీలో మీ ప్రమేయం ఎంత అనేది కూడా అభిమానుల నుంచి రావచ్చని విశ్వసనీయ సమాచారం. ప్రతిపక్షాలకు చెందిన అభిమానులు ఈ వేడుకకు వచ్చే సూచనలు వున్నాయని తెలుస్తోంది. ఒకరకంగా మెగాస్టార్‌కు సవాల్‌లాంటి వేడుకని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.