గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (10:34 IST)

త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందా?

Trisha
తమిళ చిత్రసీమలోని అగ్ర కథానాయికల్లో ఒకరైన త్రిష ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తుండగా, పొన్నియన్ సెల్వన్ విజయం తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. 
 
ఈ సందర్భంలో కొన్నేళ్లుగా విడుదలకు నోచుకోని రంగి సినిమా డిసెంబర్ 30న విడుదల కానుంది. ఈ చిత్రానికి చిత్ర దర్శకుడు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ ఈ చిత్రానికి కథ రాశారు.
 
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న త్రిషను "మీరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా?" అని ప్రశ్నించారు ఓ విలేకరి. అందుకు ఆమె నో అంటూ కామెంట్ చేసింది. 
 
ఈ వార్తలో  ఒక్క శాతం కూడా నిజం లేదని చెప్పింది. ఇంకా రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది. సినిమాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు త్రిష క్లారిటీ ఇచ్చింది.