గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2022 (09:57 IST)

నోటితో చెప్పలేని భాష వాడినపుడు ఏపీ మహిళా కమిషన్ ఎక్కకుంది? జనసేన ప్రశ్న

apwomancommission
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. దీనిపై జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా మహిళా కమిషన్‌కు ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. #APWomanCommissionExposed అనే హ్యాష్‌ట్యాగ్ పేరుతో ఈ ప్రశ్నల వర్షం కురిపించింది. 
 
* వైకాపా ప్రజా ప్రతినిధులు, మంత్రులు నోటితో చెప్పలేని అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ మహిళలను కించపరిచినపుడు మహిళా కమిషన్ ఎక్కడుంది? 
 
* అత్యాచారాలకు తల్లి పెంపకంలో లోపమే కారణమని రాష్ట్ర హోం మంత్రి అన్న వ్యాఖ్యలు మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించడం కాదా? అపుడు ఎక్కడుంది ఈ మహిళా కమిషన్.
 
* గర్భిణిలు, బాలికలపై అత్యాచారు జరిగినపుడు ఈ మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు? అని నిలదీసింది. 
 
* రెండుమూడుసార్లు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయని మహిళా మంత్రి వ్యాఖ్యానించినపుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించింది. 
 
* సుగాలి ప్రీతి విషయంలో ఈ మహిళా కమిషన్‌ ఏం చేసిందని నిలదీసింది. 
 
* ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దళిత బాలికపై యేడాది పాటు అత్యాచారం జరిగినపుడు ఈ మహిళా కమిషన్ ఎక్కడుంది? 
 
* గత యేడాది ఆగస్టు గుంటూరులో 20 యేళ్ల మహిళా ఇంజినీరింగ్ విద్యార్థినిపై పట్టపగలు దుండగుడు దాడి చేసి కడుపుపై ఆరుసార్లు కత్తితో పొడినపుడు ఈ మహిళా కమిషన్ ఎక్కడుంది? 
 
* ఈ యేడాది విజయవాడలో 23 యేళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగినపుడు మహిళా కమిషన్ ఎక్కడుందని జనసేన శతఘ్ని ట్విటర్ ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించింది.