శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (16:07 IST)

ఖరీదైన కారు కావాలా? ఇల్లు కావాలా? ఉప్పెన దర్శకుడికి భారీ ఆఫర్

ఉప్పెన చిత్రం భారీ హిట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఖుషీఖుషీగా వున్నారు. ఈ హుషారుకి కారణమైన బుచ్చిబాబు సానాకి భారీ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.
 
ఇంతకీ విషయం ఏంటయా అంటే.. ఉప్పెన చిత్రం అంచనాలకు మించిన సక్సెస్ చవిచూడటమే కాకుండా మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలకు భారీ లాభాలను తెస్తోందట. దీనితో ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసిన దర్శకుడికి బహుమతి ఇవ్వాలని నిర్మాతలు అనుకుంటున్నట్లు టాలీవుడ్ ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.
 
ఇదివరకు దర్శకుడు మారుతి, వెంకీ కుడుమలకు కూడా ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. మరి ఉప్పెన దర్శకుడికి ఇంటితో పాటు కారును కూడా బహుమతిగా ఇచ్చేస్తారేమో చూడాలి.