బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి వెంకటరమణ
Last Modified: బుధవారం, 20 మే 2020 (19:06 IST)

ఎన్టీఆర్‌తో కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా, పారితోషికం తెలిస్తే షాకే

కేజీఎఫ్ సినిమా హిట్‌తో హీరో యష్‌కు ఎంత మంచి క్రేజ్ వచ్చిందో డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న నీల్ ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మరో బహుభాషా చిత్రం తీయడానికి సన్నద్ధమవుతున్నారు. 
 
మైత్రీ మూవీస్ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ సినిమా పూర్తి మాస్ థ్రిలర్‌గా తెరకెక్కనున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఈ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
 
ఇక నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ తన విషెస్‌తో పాటుగా ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటన ఇచ్చేశారు. నా నెక్స్ట్ సినిమా న్యూక్లియర్ ప్లాంట్ లాంటి హీరోతో. నా రేడియేషన్ సూట్ తెచ్చుకోవాల్సిందే. హ్యాపీ బర్త్ డే బ్రదర్. హావ్ ఎ సేఫ్ అండ్ గ్రేట్ బర్త్‌డే. త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ సినిమా కోసం మైత్రీ మూవీస్ వారు నీల్‌కు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసారంట. ఇప్పటికే అడ్వాన్స్‌గా 2 కోట్లు ఇచ్చారని, పూర్తి పారితోషికం సుమారు 5 కోట్ల పైమాటేనని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.