గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 మే 2020 (18:43 IST)

తారక్ ఫ్యాన్స్‌కు నిరాశ.. సారీ చెప్పిన 'ఆర్ఆర్ఆర్' యూనిట్

ఈ నెల 20వ తేదీన హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆ రోజున జూనియర్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్' నుంచి ఓ టీజర్ విడుదలవుతుందని ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముందుగానే ప్రకటించారు. అంటే.. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున ఎన్టీఆర్‌కు సర్‌ప్రైజ్ గిఫ్టు ఇస్తామని ప్రకటించారు. కానీ, అనివార్య కారణాల వల్ల దీన్ని ఇవ్వలేక పోతున్నట్టు తాజాగా చిత్ర యూనిట్ తెలిపింది. 
 
ఇదే అంశంపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఏదో హ‌డావుడిగా వీడియో ప్రోమోను విడుద‌ల చేయాల‌నుకోవ‌డం లేద‌ని, తామెంతోగానో ప్ర‌య‌త్నించామ‌ని, అయితే త‌మ ప్ర‌య‌త్నాలు పూర్తి కాక‌పోవ‌డంతో తాము తార‌క్ వీడియో విడుదల చేయ‌లేక‌పోతున్నామ‌ని యూనిట్ తెలియ‌జేసింది. అయితే ఎప్పుడు తార‌క్‌ వీడియో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా అంద‌రికీ పెద్ద పండుగే అవుతుంద‌ని కూడా 'ఆర్ఆర్ఆర్' యూనిట్ తెలియ‌జేసింది. 
 
కాగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్" మూవీ. ఈ చిత్రంలో తారక్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేయాలని ముందుగానే ప్లాన్ చేశారు. కానీ, లాక్డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు. మరోవైుపు, చెర్రీ బర్త్ డే రోజున ఆయన పోషించే పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేయగా, అది వైరల్ అయిన విషయం తెల్సిందే. కానీ, ఎన్టీఆర్ విషయంలో అది జరగలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.