గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 7 మే 2020 (22:24 IST)

కేజీఎఫ్‌ డైరెక్టర్ నెక్ట్స్ మూవీ ఎవరితో ప్రభాస్‌తోనా? ఎన్టీఆర్‌తోనా?

కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన కేజీఎఫ్ సినిమా సక్సస్ సాధించడంతో అతనితో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు ఇంట్రస్ట్ చూపించారు. దీంతో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్‌ పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత తెలుగు హీరోతోనే సినిమా చేయాలనుకున్నారు. 
 
అంతేకాకుండా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో సినిమా చేసేందుకు అంగీకారం చెప్పడం కూడా జరిగింది. దీంతో మైత్రీ వాళ్లు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.
 
అయితే.. ప్రశాంత్ నీల్ ఏ హీరోతో సినిమా చేయనున్నాడు అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపించింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో సినిమా అయిన తర్వాత ప్రభాస్ - ప్రశాంత్ మూవీ ఉంటుంది అనుకున్నారు. 
 
అయితే.. ప్రభాస్ ఆ సినిమా తర్వాత మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ కి బాగా ఆలస్యం అయ్యేలా ఉంది. అందుచేత... ప్రశాంత్ నీల్ మరో హీరోతో సినిమా చేయాలనుకుంటున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరంటారా..? యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది. ఎన్టీఆర్‌ని ప్రశాంత్ నీల్ కలవడం.. కథా చర్చలు జరగడంతో ఈ కాంబినేషన్లో మూవీ కన్ఫర్మ్ అంటూ వార్తలు వస్తున్నాయి. మరి.. త్వరలో ఈ సినిమాపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.