గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:59 IST)

మహేష్‌ డైరెక్టర్ ఎన్టీఆర్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా?

సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో వంశీ పైడిపల్లి సినిమా చేయాలనుకున్నారు. మహర్షి సినిమా ఇద్దరికీ మంచి పేరు తీసుకురావడంతో వెంటనే వీరిద్దరూ సినిమా చేయాలనుకున్నారు కానీ.. ఈ ప్రాజెక్ట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత మహేష్ బాబు పరశురామ్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. అయితే.. వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ మాత్రం ఇంకా సెట్ కాలేదు. మరోసారి మహేష్‌ బాబుకి కథ చెప్పారు వంశీ. 
 
ఈసారి కూడా సేమ్ రిజెల్ట్. దీంతో ఇక మహేష్‌ బాబు కోసం ప్రయత్నించడం కన్నా వేరే హీరోని ట్రై చేస్తే బెటర్ అనుకున్నాడేమో కానీ.. ఎన్టీఆర్‌తో మూవీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. 
 
అది కూడా ఓ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ సీక్వెల్ అంటే... బృందావనం సీక్వెల్ అని టాక్ వినిపిస్తోంది.
 
ఎన్టీఆర్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన బృందావనం సినిమా సక్సస్ అయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. అయితే.. వంశీ ఎన్టీఆర్‌ని మెప్పిస్తే... ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి.. ఎన్టీఆర్ తన కథతో మెప్పిస్తాడో లేదో చూడాలి.