గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (10:27 IST)

కేజీఎఫ్ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్..

కేజీఎఫ్ దర్శకుడితో భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఎన్టీఆర్ రేంజ్‌కి తగ్గట్టుగా ప్రశాంత్ కథని సిద్ధం చేస్తుండగా, 2021 చివరలో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు తెలుస్తుంది. 
 
భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రూపొందించనున్నారు. ప్రశాంత్ నీల్‌ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు రెండేళ్లు డేట్స్ కేటాయించాడని సమాచారం. 
 
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. 
 
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.