శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (15:29 IST)

మైత్రీతో నాని సినిమా - అసలు కారణం ఇదే...!

నేచురల్ స్టార్ నాని ఇటీవల "వి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఈసారి చేసే సినిమాతో సరైన సక్సస్ సాధించాలని కథపై చాలా కసరత్తులు చేస్తున్నాడట. ప్రస్తుతం నాని 'టక్ జగదీష్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత 'శ్యామ్ సింగ రాయ్' చేయనున్నారు. పునర్జన్మ నేపధ్యంలో సాగే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలో ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నారు.
 
ఇదిలా ఉంటే... నాని మైత్రీ మూవీస్ బ్యానరులో ఓ సినిమా చేయబోతున్నాడట. ఇది నాని 28వ సినిమా. ఈ నిర్మాణ సంస్థ నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాని నిర్మించింది. మళ్లీ ఇదే బ్యానరులో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రకటన చేసి... పూర్తి వివరాలను త్వరలో ఎనౌన్స్ చేయనున్నారు. ఈ మూవీలో క్రేజీ హీరోయిన్ నజ్రియా పహదాను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నారు. 
 
అయితే.. నాని మైత్రీ మూవీస్ బ్యానరులో సినిమా చేయడానికి ఓ కారణం ఉందట. అది ఏంటంటే... మైత్రీ బ్యానర్‌లో నాని చేసిన 'గ్యాంగ్ లీడర్' మూవీ ఆశించిన విజయం సాధించలేదు. దీంతో ఈ సంస్థకు మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారట. ఆ మాట ప్రకారమే నాని ఇప్పుడు సినిమా చేస్తున్నారని తెలిసింది. విభిన్న కథాంశంతో రూపొందే ఈ మూవీ తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని.. నానికి ఖచ్చితంగా విజయం అందిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో చెబుతుంది. అద్గదీ సంగతి.