గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (22:10 IST)

"ఉప్పెన" భామకు లక్కీ ఛాన్స్... 'యువరాజు' సరసన... (video)

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన చిత్రం "ఉప్పెన". ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృతిశెట్టి నటించింది. ఈ ఒక్క చిత్రంతో ఈ అమ్మడుకు స్టార్ ఇమేజ్ వచ్చింది. వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇటు టాలీవుడ్, అటు కోలీవడ్ చిత్ర పరిశ్రమల్లో నటించే ఛాన్సులు కొట్టేస్తోంది. ఇప్పటికే పలువురు హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకున్న కృతి.. ఇపుడు మరో గోల్డెన్ ఛాన్స్ వరించింది. టాలీవుడ్ యువరాజు మహేష్ బాబు మూవీలో ఛాన్స్‌ వరించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం మహేష్ తన 27వ చిత్రం 'సర్కారువారిపాట' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే రాజమౌళితో సినిమా చేయడాని కంటే ముందే మహేశ్‌ మరో సినిమాను చేయాలనుకుంటున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు... దర్శకుడు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయని టాక్‌. ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌ సైలెంట్‌గా జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌ ఇంటర్వ్యూలోనూ అనీల్‌ రావిపూడి మహేశ్‌తో చేయబోయే సినిమా గురించి ఇన్‌డైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చాడు. 
 
తాజాగా మహేశ్‌, అనీల్‌ రావిపూడి సినిమాకు సంబంధించి మరో వార్తొకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. అదేంటంటే.. రీసెంట్‌గా విడుదలైన 'ఉప్పెన'తో క్రేజ్‌ తెచ్చుకున్న హీరోయిన్‌ కృతిశెట్టిని ఈ సినిమాలో మహేశ్‌ జోడీగా నటింప చేయనున్నారు. ఇదే కనుక నిజమైతే సూపర్‌స్టార్‌ సినిమాలో అవకాశం దక్కించుకుని కృతి బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లే అంటున్నారు మరి.