ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సందీప్ రేవిళ్ల
Last Modified: బుధవారం, 24 ఏప్రియల్ 2019 (16:40 IST)

విజయ్ దేవరకొండ తెలివిగా తన తండ్రితో ఆ పని చేయించాడు...

సాధారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో సినిమా మొదలు పెట్టిన నిర్మాతలు చివరిదాకా కొనసాగుతారన్న గ్యారెంటీ ఉండటం లేదు. ప్లానింగ్‌తోనో లేదా ఇతర కారణాల వలన ప్రాజెక్టులు చేతులు మారుతుంటాయి. విజయ్ దేవరకొండ ముచ్చటపడి నాన్న వర్ధన్ దేవరకొండ నిర్మాతగా తీసుకున్న ఒక సినిమా ఇప్పుడు చేతులు మారింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే దశలో ఉండగా ఇలా చేతులు మారడం విశేషం. వర్ధన్ దేవరకొండ పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్‌కి ఈ సినిమాలో కీలక పాత్ర ఇచ్చాడు. 
 
ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడిని కూడా పరిచయం చేస్తున్నాడు. కథ నచ్చడం వల్ల అసలు ఈ సినిమాని విజయ్ దేవరకండనే చేయాలనుకున్నాడు. కానీ ఆ సమయానికే విపరీతంగా పెరిగిపోయిన కమిట్‌మెంట్స్‌తో పాటు మార్కెట్‌లో తన ఇమేజ్‌కు వచ్చిన మార్పుల దృష్ట్యా ఇష్టం లేకపోయినా వదులుకున్నాడు. అయితే పెట్టుబడి మాత్రం పెట్టాడు. ఇప్పుడు ఇది ఏషియన్ సునీల్ హ్యాండ్స్‌లోకి వెళ్లింది. 
 
చాలా రీజనబుల్ ప్రైజ్‌కే సునీల్ నారంగ్‌కి ఈ డీల్ కుదిరిందట. ఈ మేరకు విజయ్ నాన్న వర్ధన్ తాజాగా సునీల్‌ను కలిసి ఈ సినిమా తాలూకు హక్కులు ఇచ్చి చెక్ పొందారు. ఇలా చేయడం వల్ల స్వంతంగా విడుదల చేసుకునే ప్రయాసతో పాటు మంచి ధియేటర్లు దొరుకుతాయా లేదా అన్న టెన్షన్ ఉండదు. ఏషియన్ సంస్థ కాబట్టి డిస్ట్రిబ్యూషన్ మొదలుకుని రిలీజ్ దాకా అన్నీ పక్కాగా జరుగుతాయి. పబ్లిక్‌కి బాగా రీచ్ అవుతుంది. విజయ్ దేవరకొండ దూరదృష్టితో ఆలోచించి తండ్రితో ఈ పని చేయించాడు.