సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (11:35 IST)

సూర్యతో పోటీనా? రేస్ నుంచి తప్పుకున్న 'డియర్ కామ్రేడ్'

తెలుగునాట సాధించిన విజయంతో సంతృప్తి చెందక పక్క భాషలలో హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతూ... విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా టీజర్‌తోనే సినిమాపై ప్రేక్షకుల అంచనాలు పెంచేసింది. అయితే, ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకాభిమానులను ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసి నిరాశపరిచారట విజయ్. 
 
వివరాలలోకి వెళ్తే... మే 31న ‘డియర్‌ కామ్రేడ్’ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కావలసి ఉంది. కానీ అదే రోజున ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘ఎన్‌జీకే’ చిత్రం విడుదల కానుండడంతో... తన అభిమాన నటుడైన సూర్య కోసం తన సినిమాను వాయిదా వేసుకోవాలనుకున్నారట విజయ్‌. ఈ మేరకు తన సినిమాను జూన్‌ 6వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని చిత్రవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.