శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (12:27 IST)

విజయ్ దేవరకొండతో బాలీవుడ్ భామ

టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే మంచిపేరు సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇటీవల ముంబైలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్ దంపతులతో పాటు అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, కైరా అద్వానీతో పలువురు సినీ తారలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా అర్జున్ రెడ్డీ సినిమా హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న కైరా అద్వానీ ఇటీవల విజయ్ దేవరకొండను కలుసుకోవడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
తెలుగులో భరత్ అను నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌ ‘కబీర్ సింగ్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మేరకు నెటిజన్స్ వీరి ఫోటోలను చూసి అర్జున్ రెడ్డితో బాలీవుడ్ ప్రీతి అని కామెంట్స్ చేస్తున్నారు.