ప్రకృతిని ప్రేమిస్తానంటున్న ఫిదా హీరోయిన్.. నానితో వార్!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం "ఫిదా". ఈ సూపర్ డూపర్ హిట్ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించి మంచి మార్కులతో పాటు ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. పైపెచ్చు ఆమె క్రేజ్

మంగళవారం, 3 అక్టోబరు 2017 (14:16 IST)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం "ఫిదా". ఈ సూపర్ డూపర్ హిట్ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించి మంచి మార్కులతో పాటు ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. పైపెచ్చు ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫలితంగా ఆమెకు వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఆమె నాని జోడీగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ప్రేమమ్' మలయాళ సినిమాకి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పింది. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో గుప్పెట్లో సీతాకోక చిలుకను ఉంచి.. కొన్ని క్షణాల తర్వాత గుప్పెట తెరచి దానిని గాల్లోకి వదిలి సాయిపల్లవి ఆనందించాలి.
 
అయితే సీతాకోక చిలుకను గుప్పెట్లో ఉంచి .. తెరిచేలోగా దానికి ఏమైనా అవుతుందేమోనని ఆమె చాలా టెన్షన్ పడిపోయిందట. అలాంటివాటిని ఇబ్బంది పెట్టడం తనకి ఎంత మాత్రం ఇష్టం ఉండదనీ.. మరోసారి అలాంటి సీన్స్ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పింది. ప్రకృతిని ఆరాధించడం, అందులోని జీవరాశిని చూసి ఆనందించడం చేయాలి తప్ప, దేనికీ హాని చేయకూడదని చెప్పుకొచ్చింది. 
 
అదేసమయంలో ఇదే చిత్రం షూటింగ్ సమయంలో నాని, సాయి పల్లవిల మధ్య గొడవ జరిగిందట. అయితే, ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. షూటింగ్ సందర్భంగా, ఓ డైలాగుకు సంబంధించి సాయి పల్లవికి నాని ఓ సలహా ఇవ్వబోయాడట. ఇదే వీరిద్దరి మధ్య గొడవకు కారణమైందట. వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చాలని నిర్మాత ప్రయత్నించినా... కుదరలేదట. 
 
ప్రస్తుతం వీరిద్దరూ కలసి ఏదో ఇక విధంగా షూటింగ్ పూర్తి చేసేసి... మాట్లాడుకోకుండానే వెళ్లిపోతున్నారట. మరోవైపు, సాయిపల్లవి కొంచెం కంట్రోల్ ఉంటే మంచిదని... చిన్న విషయాలకు కూడా గొడవపడితే, ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టమవుతుందని కొందరు అంటున్నారు. 

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments