మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (18:09 IST)

అల్లు అర్జున్ 'పుష్ప'లో లేడీ విలన్‌గా ఎమ్మెల్యే రోజా? (Video)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుండగా, ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. 
 
బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అల వైకుంఠపురములో" చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో 'పుష్ప'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ని, అల్లు అర్జున్‌ లుక్‌ని విడుదల చేశారు ద‌ర్శ‌కనిర్మాత‌లు. దీనికి మంచి స్పందన వచ్చింది. 
 
ఇక ఆ తర్వాత ఈ సినిమాలో నటించే వారి విషయంలో రోజుకొక పేరు వినిపిస్తూ.. ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. యాంకర్ సుమ ఈ చిత్రంలో బన్నీకి అక్కగా చేస్తుందనే వార్తలు వచ్చాయి. సంజయ్ దత్ విలన్ అంటూ వార్తలు వచ్చాయి. ఇలా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో లేడీ విలన్ అంటూ మరొక వార్త పుట్టుకొచ్చింది. 
 
ఆ లేడీ విలన్ ఎవరో కాదు.. నటి, రాజకీయ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజా. అవును ఈ సినిమాలో రోజా విలన్‌గా చేస్తుందట. చిత్రకథలో తన పాత్రకు చాలా గుర్తింపు ఉండటంతో.. వెంటనే రోజా అంగీకరించిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 
 
కె. సుకుమార్ సినిమాలో పాత్రలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. ఇందులో విలన్ పాత్రకు సుకుమార్ అధిక ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే రోజా వెండితెరపై రీ ఎంట్రీకి ఓకే చెప్పిందని అంటున్నారు. అయితే చిత్రయూనిట్ నుంచి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.