మంగళవారం, 3 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (18:50 IST)

కాంతారా ఎఫెక్ట్.. దైవ నర్తకాలకు నెలవారీ భత్యం ప్రకటింపు

Kanthara
Kanthara
కాంతారా సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. కథ అదరగొట్టడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది ఈ సినిమా. ఈ కాంతారా సినిమా ప్రేక్షకులనే కాకుండా ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా కాంతారా ప్రభావం కాంతారా సినిమాపై పడింది. కర్ణాటక ప్రభుత్వం 'దైవ నర్తకాలు' కోసం నెలవారీ భత్యాన్ని ప్రకటించింది.
 
ఈ చిత్రం అన్ని వర్గాల నుండి, ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి విపరీతమైన ప్రేమను పొందినప్పటికీ, ఇది భారతీయ అధికారుల హృదయాలలో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సభ్యుడు, పిసి మోహన్ కాంతారా సినిమాపై స్పందించారు. 

కాంతారావు చిత్రం ప్రభావం కారణంగా చాలామంది ప్రస్తుతం దైవాలు, వారి నృత్యాన్ని ఆరాధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన ‘దైవ నర్తకుల’కు నెలవారీ రూ.2,000 భృతిని ప్రకటించింది. 
Kanthara
Kanthara
 
కాంతర చిత్రంలో చిత్రీకరించబడిన ఆత్మ పూజా ఆచారం ప్రాచీనమైనది. కాంతారావు పురాణ కథతో శాండల్‌వుడ్ పరిశ్రమ పీక్స్‌కి చేరుకుంది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీసును షేక్ చేస్తోంది.