Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

17 ఏళ్ళ క‌ల‌యిక ఆర్య‌

Updated: శుక్రవారం, 7 మే 2021 (19:49 IST)
anuradha, allu arjun, sukumar
గంగోత్రి లాంటి భిన్న‌మైన క‌థ‌తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కుడు అల్లు అర్జున్‌. ఆ సినిమా త‌ర్వాత కొంత గేప్ తీసుకుని చేసిన సినిమా `ఆర్య‌`. గోదావ‌రి జిల్లాలోని మేక్స్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేసిన సుకుమార్ ఆ సినిమాకు స‌రికొత్త క‌థ‌తో వ‌చ్చాడు. ఈ సినిమా 2004 మే 7న విడుదలై అఖండ విజయం సాధించింది. అల్లు అర్జున్ అనురాధ మెహతా, శివ బాలాజీ ప్రధాన పాత్రలో న‌టించారు.
 
ఇది సుకుమార్‌కు మొద‌టి సినిమా. ఒన్‌సైడ్ ల‌వ్ కాన్సెప్ట్‌. అయితే అందులో అన్ని కోణాలుంటాయి. అందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా స‌రికొత్త‌గా ప్లాన్ చేశాడు. వన్ సైడ్ లవ్` అనే కాన్సెప్ట్ అప్ప‌టి యూత్‌కు బాగా న‌చ్చింది. ఇక సంభాష‌ణ‌ప‌రంగా కేచీగా వుండేట్లుగా యూత్ మాట్లాడుకునే విధంగా వుండ‌డంతో అదొక ఎస్సెట్ గా సినిమాకు నిలిచింది. ఇక అల్లు అర్జున్ కేవలం యాక్టింగ్ తోనే కాదు డాన్స్ లతోనూ, స్టంట్స్ తోనూ యువతరాన్ని అలరించారు
 
ఇందులోని పాటుల‌కూ దేవీశ్రీ‌ప్ర‌సాద్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. అత‌ను యువ‌కుడే కాబ‌ట్టి త‌న తెలివితేట‌ల‌తో యూత్‌ను అల‌రించేవిధంగా బాణీలు కూర్చాడు. అప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు ఏంతో భిన్నంగా వచ్చిన అటు కమర్షియల్‌గా ఇటు సినిమా పరంగా ఓ ట్రెండ్‌ను క్రియెట్ చేసింది. దిల్‌రాజు ఈ సినిమాను విడుద‌ల చేశారు. ఈ సినిమా ఒక‌ర‌క‌మైన ట్రెండ్ సృష్టించింది. దాంతో సుకుమార్ ఆర్య‌2 అని కూడా తీశాడు. అదీ హిట్ అయింది. ఇప్పుడు మ‌ళ్ళీ ముచ్చ‌ట‌గా మూడో సినిమా వీరి కాంబినేష‌న్‌లో `పుప్ప‌` రాబోతుంది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments