ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (13:31 IST)

అల్లు అర్జున్‌కు క‌రోనా పాజిటివ్, ఫ్యాన్సుకి సూచ‌న‌

Allu Arjun
స్ట‌యిలిష్ స్టార్ న‌టుడు అల్లు అర్జున్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారంనాడు ఆయ‌న ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు. కొంచెం న‌ల‌త‌గా వుండ‌డంతో డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాడ‌ట‌. టెస్ట్ చేసిన అనంత‌రం కోవిడ్‌619 టెస్ట్‌లో పాజిటివ్ అని తేలింద‌ని పేర్కొన్నారు. అందుకే త‌నేను ఐసోలేష‌న్‌లోనే అది కూడా ఇంటిలోనే వుంటున్నా. అయితే ముందు జాగ్ర‌త్త‌గా మాత్ర‌మే ఇది. పాజిటివ్ అనే పూర్తిగా రాలేదు. చిన్న‌పాటి సూచ‌న‌లు మాత్ర‌మే వ‌చ్చాయి. అందుకే తాను ఇంటిలో వుంటున్నాన‌ని తెలియ‌జేస్తున్నాడు.

అభిమానులు జాగ్ర‌త్త‌
అభిమానులకు విజ్ఞ‌ప్తి చేస్తూ, మీరేమి కంగారు ప‌డ‌వ‌ద్దు. నేను త్వ‌ర‌గా కోలుకుంటాను. మీరు జాగ్ర‌త్త‌గా మీ మీ ఇళ్ల‌లో వుండండి. సే సేఫ్ సే హోమ్‌.. అంటూ వెల్ల‌డించారు. అదేవిధంగా మీ ఇంటిలోని కుటుంబ స‌భ్యుల‌ను కూడా మీరు జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. ముందు మీరు బాగుండాలి. అంటూ సూచించారు. కాగా, ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కూడా ఐసొలేష‌న్‌లో వున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న నెగెటివ్‌కు చేరుకున్నారు. అయినా ఆయ‌న బ‌య‌ట‌కు రాకుండా ఇంటివ‌ద్ద‌నే వున్నారు.