శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (14:28 IST)

#2Point0Release : రజనీ ఎంట్రీ... స్క్రీన్ ఫ్రీజ్.. డప్పు వాయిస్తూ చిందేసిన ఫ్యాన్స్

తలైవా రజనీకాంత్ నటించిన తాజా చిత్రం "2.O". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ హిట్ అంటూ ప్రతి సినీ క్రిటిక్ తమతమ రివ్యూల్లో పేర్కొంటున్నారు. అయితే, ముంబైలోని వాడ్లా ఐమ్యాక్స్ థియేట‌ర్‌లో ర‌జ‌నీ అభిమానులు చిందేశారు. ఫిల్మ్‌లో త‌లైవా రజ‌నీ ఎంట్రీ షాట్‌ను 3 నిమిషాల పాటు ఫ్రీజ్ చేశారు. ఆస‌మ‌యంలో ర‌జ‌నీ అభిమానులు థియేట‌ర్ స్క్రీన్ ముందు డ్యాన్స్‌తో చెల‌రేగిపోయారు. ర‌జ‌నీ ఫ‌స్ట్ ఫ్రేమ్‌ను చూసిన ప్రేక్ష‌కులు.. డ‌ప్పు వాయిస్తూ చిందేస్తూ నానా హంగామా సృష్టించారు. 
 
ఇదిలావుంటే, ర‌జనీకాంత్ కుమార్తె సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ఒక్క మాట‌లో ఈ మూవీని ఆకాశానికి ఎత్తింది. 'ఓ మై గాడ్!! "2.O" చిత్రం ఇప్పటివరకూ మనం ఈ ప్రపంచంలో చూడని ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది' అంటూ ట్వీట్‌లో పేర్కొంది. త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌తో పాటు పలు బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఈ సినిమా చాలా గొప్పగా ఉందంటూ రివ్యూలు ఇస్తున్నారు. 
 
అక్ష‌య్ కుమార్ పాత్ర‌లో మ‌రో న‌టుడిని ఊహించుకోలేక‌మ‌ని, అమీ జాక్స‌న్ చాలా అద్భుతంగా న‌టించింద‌ని సినిమా చూసిన వారు చెబుతున్నారు. ఊహించిన‌ట్టుగానే ఈ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో ఇక రికార్డుల వేట మొద‌లైంది. మొద‌టి రోజు ఈ చిత్రం ఎన్ని కోట్ల వ‌సూళ్లు రాబ‌డుతుందా అని విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు.