మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (08:56 IST)

రజనీకాంత్ '2.O' మూవీ రివ్యూ : చివరి 30 నిమిషాలు అద్భుతం

సంచలన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరక్కిన చిత్రం "2.O". రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రతి నాయకుడుగా నటించాడు. ఈ మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 
 
ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌లు ఇప్పటికే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. నెట్టింట్లో ఎన్నో సంచనాలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో గురువారం విడుదలైన మూవీ టాక్ సూపర్బ్‌గా ఉన్నట్టు టాక్ వస్తోంది. 
 
ముఖ్యంగా, చివరి 30 నిమిషాలు అద్భుతంగా ఉండటమేకాకుండా ఈ మూవీకే హైలెట్‌గా నిలిచింది. విలన్‌గా నటించిన అక్షయ్ కుమార్, హీరో రజనీకాంత్‌లు పడిన కష్టం ఈ చిత్రంలో స్పష్టంగా తెలుస్తోంది. 
 
అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్, టెక్నికల్ విలువలు సూపర్బ్‌గా ఉన్నాయి. మొత్తంమీ శంకర్ పడిన కష్టానికి ఫలితం దక్కింది. అయితే, ఈ చిత్రం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిన 'బాహుబలి' చిత్రాన్ని బీట్ చేస్తుందా లేదా అన్నది ఇపుడు తేలాల్సివుంది.