ఆ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగార్జున..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆఫీసర్ డిజాస్టర్ తర్వాత దేవదాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి మంచి ఆదరణ లభించినప్పటికీ ఆశించిన స్ధాయిలో విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం నాగార్జున ధనుష్‌తో కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బ్రహ్మాస్త్ర అనే హిందీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే.. ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమా చేయనున్నాడో చెప్పలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటంటే... సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నాగార్జున నిర్మిస్తున్నారు. ఇటీవల ఫుల్ స్ర్కిప్ట్ విన్న నాగ్ ఓకే చెప్పారట. ఇంకోటి చి.ల.సౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా.
రాహుల్ చెప్పిన కథ కూడా విని ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ రెండు సినిమాలు చేయడానికి నాగ్ ఓకే చెప్పారట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు అని సమాచారం. మరి... ఈ రెండింటిలో ఏ సినిమాని ముందు స్టార్ట్ చేస్తారో చూడాలి.