గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2022 (11:11 IST)

చలపతిరావుకు సినీ ప్రముఖుల నివాళులు.. బుధవారం అంత్యక్రియలు

chalapathirao
సీనియర్ నటుడు చలపతిరావుకు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. గుండెపోటు కారణంగా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన పార్థివదేవాన్ని కుమారుడు, నటుడు రవిబాబు నివాసంలో ఉంచారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు అమెరికాలో ఉన్నారు. వారు వచ్చేంత వరకు చలపతిరావు పార్థివదేహాన్ని రవిబాబు నివాసంలోనే ఉంచనున్నారు. 
 
కాగా, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని రవిబాబు నివాసంలో ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి తరలించి, ఫ్రీజర్‌లో ఆయన కుమార్తెలు అమెరికా నుంచి వచ్చేంత వరకు ఉంచుతారు. ఆ తర్వాత బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా, కైకాల సత్యనారాయణ కన్నుమూసి రెండు రోజులు కూడా కాకముందే చలపతిరావు కన్నుమూయడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.