గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2022 (16:43 IST)

Avatar 2 చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

Avatar: The Way Of Wate
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌ అవతార్ 2 చూడటానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా అవతార్ సినిమా చూస్తూ ఏపీకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ జిల్లాలో పెద్దాపురం ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్లాడు. సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ లక్ష్మీరెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
ఇక భారీ అంచనాల నడుమ రిలీజైన అవతార్‌-2 అంతే స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన హాలీవుడ్‌ మూవీగా సరికొత్త రికార్డు సృష్టించింది.