శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (17:05 IST)

ఆనంద్ రవి నటిస్తోన్న కొరమీను నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

Anand Ravi, Harish Uttaman
Anand Ravi, Harish Uttaman
ప్రేమ‌కు పేద‌, ధ‌నిక అనే బేదం ఉండ‌దు. మ‌న‌సుకు న‌చ్చిన వారు క‌న‌ప‌డితే చాలు వెంట‌నే ప్రేమ పుడుతుంది. మనసులో ప్రేమ పుట్టటం కాదు.. ఆ ప్రేమ‌ను నిచ్చెలికి అందంగా చెప్ప‌ట‌మూ ఓ క‌ళ. మీనాక్షిని చూడ‌గానే ఆ యువ‌కుడికి హృద‌యం ల‌య త‌ప్పింది. ఇంకేముంది.
 
‘‘మీనాచ్చి మీనాచ్చి నిన్నే చూడ‌గా.. ఓ.. ఓ.. ’అంటూ  అందంగా పాట రూపంలో మీనాక్షిని త‌న ప్రేమ‌ను చెప్పేశాడా యువ‌కుడు. ఇంత‌కీ క‌థానాయ‌కుడు ఎవ‌రు? అత‌ని హృద‌యాన్ని దోచుకున్న మీనాక్షి ఎవ‌రు? అనే విష‌యం తెలుసుకోవాలంటే ఆనంద్ ర‌వి హీరోగా న‌టిస్తోన్న  ‘కొరమీను’ సినిమా చూడాల్సిందే. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమా డిసెంబ‌ర్ 31న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన  మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు ... ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’.
 
రొటీన్‌కి భిన్నంగా ‘‘మీసాలు రాజుకు మీసాలు ఎందుకు తీసేశారు’’ అనే కాన్సెప్ట్‌తో సినిమా ప్ర‌మోష‌న్స్‌ను షురూ చేశారు. దీంతో అంద‌రిలోనూ మీసాల రాజు మీసాల క‌థ‌ను తెలుసుకోవాలనే ఎగ్జ‌యిట్‌మెంట్ పెరిగింది. అక్క‌డి నుంచి డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో కొర‌మీను సినిమా అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ‘తెలిసింది లే..’ అనే పాటను విడుదల చేయగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘మీనాచ్చి మీనాచ్చి’ అనే మెలోడి సాంగ్‌ను చిత్ర యూనిట్ గురువారం రోజున విడుద‌ల చేసింది. పూర్ణాచారి రాసిన ఈ పాట‌ను సూర‌జ్ సంతోష్ స‌హ‌జ సిద్ధంగా పాడిన తీరు అందరినీ ఆక‌ట్టుకుంటోంది. అనంత్ నారాయ‌ణ‌న్ ఎ.జి ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఆనంద్ రవికి జోడిగా కిషోరి ధాత్రక్ జంటగా నటించింది.
 
 ‘కొరమీను’ చిత్రాన్ని  గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మ‌హేశ్వ‌ర్ రెడ్డి  తెలుగు రాష్ట్రాల్లో డిసెంబ‌ర్ 31న  గ్రాండ్‌గా రిలీజ్  చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి.