గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (19:45 IST)

మృగశిర కార్తె వచ్చేసింది.. కొరమీను కూర ఇలా ట్రై చేయండి..

fish curry
కావలసిన పదార్థాలు 
కొరమీను చేపలు - అరకేజీ, 
అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, 
ఉల్లిపాయ - ఒకటి, 
ఉప్పు - రుచికి తగినంత, 
పసుపు - అర టీస్పూన్‌, 
కారం- రెండు టీస్పూన్లు, 
నూనె - సరిపడా, 
కరివేపాకు - కొద్దిగా, 
కొత్తిమీర - ఒకకట్ట.
ధనియాల పొడి -  రెండు టీస్పూన్లు
జీలకర్రపొడి - అర టీస్పూన్‌, 
మెంతిపొడి - అర టీస్పూన్‌, 
చింతపండు - యాభై గ్రాములు
 
తయారీ విధానం: ముందుగా శుభ్రం చేసుకున్న చేపముక్కలను కాస్త కారం, ఉప్పు చేర్చి పక్కనబెట్టుకోవాలి. ఒక బౌల్‌లో చింతపండు రసం, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి బాగా కలపాలి.
 
ఆపై ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేగాక, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేగాక ధనియాల పొడి వేయాలి. 
 
తరువాత కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. గ్రేవీకి తగినంత నీళ్లు పోసుకోవచ్చు. తర్వాత సిద్ధం చేసుకున్న చింతపండు రసం మిశ్రమాన్ని చేర్చి బాగా ఉడకనివ్వాలి. గ్రేవీలా తయారయ్యాక 
 
కొర్రమీను ముక్కలు వేసి ఐదు నుంచి 10 నిమిషాల పాటు ఉడికిన తరువాత కొత్తిమీర వేసుకొని దించాలి. అంతే కొరమీను గ్రేవీ రెడీ.