గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (16:10 IST)

మృగశిర కార్తె.. చేపలు తప్పకుండా తినాల్సిందేనా..? కారణం ఏంటి?

Fish
అసలు మృగశిర రోజు చేపలు ఎందుకు తినాలి.. అనే అనుమానం మీలో వుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం చదవండి మరి. సాధారణంగా మృగశిర కార్తీక వచ్చిదంటే చాలు పల్లెల్లో చెరువుల వద్ద సందడి కనిపిస్తుంటుంది. మృగశిర కార్తీక రోజు చేపలు తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదట. అందువలన ఆనాది కాలం నుంచి ఈ పద్ధతి అమలులో ఉంది.
 
చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతే కాకుండా వీటిని తినడం వలన అనేక వ్యాధులు దూరమవుతాయంటారు. అయితే ఎండకాలం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో శరీరంలో వేడి ఉండేందుకు చేపలు తింటారు. అంతే కాకుండా ఈ చేపలు గుండె జబ్బులు, ఆస్తమా పేషంట్లకు మంచి ఔషదంగా చెప్పవచ్చు.
 
ఇక ఈ రోజు చేప మందు కూడా పంపిణీ చేస్తుంటారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన మృగశిర కార్తె 15 రోజుల పాటు ఉంటుంది. అలాంటి సమయంలో చేపలు తింటే.. వ్యాధులు దూరమవుతాయనేది ప్రజల బలమైన విశ్వాసం.
 
ఈ రోజు మృగశిర కార్తె ప్రారంభం అయ్యింది. కృత్తిక‌, రోహిణి కార్తెల్లో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగ‌శిర‌ కార్తె ప్రవేశం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. 
 
వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. మరోవైపు ఇవాళ హైదరాబాద్‌లోని చేపల మార్కెట్లన్నీ పుల్ రద్దీతో దర్శనమిస్తున్నాయి. 
 
మృగశిర కార్తె రాకతో వర్షాలు పడుతుంటాయి. ఫలితంగా కొన్ని సీజనల్ వ్యాధలు ప్రబలే అవకాశం ఉంటుంది. తద్వారా కాస్త ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చేపలు తింటుటారానే వాదన ఉంది.