శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 జులై 2024 (14:20 IST)

అజిత్ కుమార్ కు పోటీగా విడాముయ‌ర్చి లో యాక్ష‌న్ కింగ్ అర్జున్

Action king Arjun
Action king Arjun
యాక్ష‌న్ కింగ్ అర్జున్‌  హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, ప్ర‌తినాయ‌కుడిగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఈయ‌న మెప్పించారు. మ‌రోసారి త‌న‌దైన శైలిలో మ‌రో విభిన్న‌మైన పాత్ర‌తో ‘విడాముయ‌ర్చి’లో ఆక‌ట్టుకోబోతున్నారాయ‌న‌. అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ‘విడాముయ‌ర్చి’ నుంచి యాక్ష‌న్ కింగ్ అర్జున్ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.
 
పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ఓ రోడ్డుపై స్టైలిష్ లుక్‌ను అర్జున్ నిల‌బ‌డి ఉన్నారు. బ్యాగ్రౌండ్‌లో అజిత్ షాడోలో క‌నిపిస్తున్నారు.  అస‌లు అర్జున్‌కి, అజిత్ పాత్ర‌కు ఉన్న లింకేంట‌నే ఆస‌క్తిని పోస్ట‌ర్‌తో క్రియేట్ చేశారు మేక‌ర్స్‌. ‘ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్’ (కష్టం ఎప్పటికీ వృథా కాదు) అనే అర్థం వచ్చేలా ఉన్న వ్యాకం మ‌రింత క్యూరియాసిటీని క‌లిగిస్తోంది.
 
అజిత్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించ‌నున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.
 
అజిత్ కుమార్  ‘విడాముయ‌ర్చి’ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలకాబోతుంది.