సోమవారం, 10 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మార్చి 2025 (17:38 IST)

సినీ నటి అభినయకు నిశ్చితార్థం

abhinaya
సినీ నటి అభినయకు వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాఖాతాలో వెల్లడించారు. అయితే, ఆమెకు కాబోయే భర్త గురించిన వివరాలను మాత్రం ఆమె గోప్యంగా ఉంచారు. కొద్ది రోజుల క్రితం ఒక సినిమా ప్రమోషన్స్‌లో తన ప్రేమ జీవితం గురించి ఆభినయ వెల్లడించిన విషయం తెల్సిందే. 
 
గత 15 సంత్సరాలుగా తాను ప్రేమలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. అదేసమయంలో కోలీవుడ్ హీరో విశాల్‌తో ఆమెకు ప్రేమ వ్యవహారం ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఆమె ఖండించారు కూడా. కాగా, నటి అభినయ వినికిడి, మాట లోపం (మూగ) ఉన్న అమ్మాయి అయినప్పటికీ పలు సినిమాల్లో ఆమె అద్భుతమైన నటనతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.