ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2024 (20:20 IST)

ఆరేళ్ల ప్రేమాయణం.. సాయివిష్ణుతో మేఘా ఆకాష్ పెళ్లి.. ఫోటోలు వైరల్

Megha Akash
Megha Akash
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. గురువారం సాయివిష్ణుతో మేఘా ఆకాష్ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. మేఘా ఆకాష్‌, సాయివిష్ణు ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 
 
ఈ ఏడాది చివ‌ర‌లో మేఘా ఆకాష్‌, సాయివిష్ణు పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సాయివిష్ణు ఓ పొలిటీషియ‌న్ కొడుకు అని స‌మాచారం. గ‌త ఆరేళ్లుగా వీరిద్ద‌రు ప్రేమ‌లో వున్నట్లు పుకార్లు వస్తున్నాయి. 
Megha Akash
Megha Akash
 
ఇటీవ‌లే తుఫాన్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. నితిన్ లై మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్‌. ఛ‌ల్ మోహ‌న‌రంగ‌, రాజ రాజ చోర‌, డియ‌ర్ మేఘ‌తో పాటు తెలుగులో ప‌లు సినిమాలు చేసినా స‌క్సెస్‌ల‌ను అందుకోలేక‌పోయింది.