అలీ: నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు..

Last Updated: మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (14:33 IST)
నటుడు అలీ మంచి కమెడియన్‌గా తను నటించే ప్రతీ ఒక్క సినిమాలో అందరీ మన్ననలను పొందుతాడు. కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. మరికొన్ని ఛానెల్స్‌లో యాంకర్‌గా, న్యాయమూర్తిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ నటుడు అలీ. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలీకి మంచి పేరు, గుర్తింపు ఉంది. 1979వ సంవత్సరంలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రం ద్వారా బాలనటుడిగా సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

అంతేకాదు.. బాలనటుడిగా పరిచయమైన అలీ.. సినీ రంగ ప్రవేశం చేసి ఈ సంవత్సరంతో నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అలీని ప్రముఖ సాంస్కృతిక సంస్థ సంగమనం ఘనంగా సత్కరించనుంది. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23వ తేదీనా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆడిటోరియంలో జరుగనుంది.

ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు ముఖ్య అతిథిగా రానున్నారని సంస్థ స్థాపకులు సంజరు కిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్, సినీరంగ ప్రముఖులు రాఘవేంద్రరావు, అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ్, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొంటున్నారు.దీనిపై మరింత చదవండి :