చెక్కపుల్లను కనిపెట్టడానికి అర్ధనగ్నంగా పురుషులు పోటీ పడతారట..
జపాన్‌లో జరిగిన ఓ ఉత్సవంలో.. అర్థ నగ్నంగా వుండిన వేలాది మంది పురుషులు పవిత్రమైన చెక్కపుల్లను వెతికే పనిలో పడ్డారు. జపాన్‌లోని ఒగాయామాలోని ఓ బుద్ధుని ఆలయంలో ప్రతి ఏటా సంప్రదాయ ఉత్సవం జరుగుతూ వస్తోంది. ఈ ఉత్సవంలో వేలాది మంది అర్ధనగ్నంగా దాదాపు పదివేల మంది పురుషులు పాల్గొన్నారు.
ఆ ప్రాంతంలో దాచిపెట్టిన పవిత్ర చెక్కపుల్లను కనిపెట్టేందుకు పురుషులందరూ ముందు నీటిలో మునిగి వెళ్తారు. సింగి అనే పిలువబడే దాదాపు 20 సెం.మీటర్ల పొడవుగల పవిత్ర చెక్కపుల్లను కనిపెట్టాలి. అలా ఎవరైనా ఆ పుల్లను కనిపెడితే ఆ సంవత్సరం అతనిని అదృష్టం వరిస్తుందని విశ్వాసం. 500 సంవత్సరాల పూర్వం నుంచి పండుగను జరుపుకుంటారని... ఆ పుల్లను కనిపెట్టే వారికి సకలసంపదలు చేకూరుతాయని నమ్మకం.
ఈ పోటీల్లో పాల్గొనే వారు తీవ్రగాయాలకు గురవుతారని.. తొక్కిసలాట కూడా జరుగుతుందని.. జీవితంపై ఆశలు వదులుకుని ఈ పోటీల్లో పాల్గొంటారట. అదృష్టం కోసం పోటీపడి.. ఇతరులను లెక్కచేయకుండా చెక్కపుల్లను వెతికిపట్టుకుంటారు.