సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Ivr
Last Updated : మంగళవారం, 23 మే 2017 (14:09 IST)

'శయనేషు రంభ' అంటే ఏమిటి..? చలపతి రావు ప్రశ్న

అక్కినేని నాగచైతన్య నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు 'అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు' అంటూ చేసిన కామెంట్లపై మహిళా లోకం భగ్గుమంటోంది. చలపతిరావు బహిరంగంగా క్షమాపణలు

అక్కినేని నాగచైతన్య నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు 'అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు' అంటూ చేసిన కామెంట్లపై మహిళా లోకం భగ్గుమంటోంది. చలపతిరావు బహిరంగంగా క్షమాపణలు చెప్పినా తాము విడిచిపెట్టబోమనీ, ఆయనకు కఠిన శిక్ష విధించేవరకూ విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు.
 
మరోవైపు చలపతిరావు తన వ్యాఖ్యలపై ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్‌తో మాట్లాడుతూ... తన మటుకు తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని అనుకుంటున్నాననీ, ఐతే నా వ్యాఖ్యలు తప్పు అంటున్నారు కాబట్టి మహిళా లోకానికి క్షమాపణలు చెపుతున్నానని వెల్లడించారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చారు.
 
కానీ 'కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ' అని చెప్పిన కవి మాటలో శయనేషు రంభ అనేదేగా నేను చెప్పింది. నన్ను అరెస్టు చేస్తే ఆనాడు శయనేషు రంభ అని చెప్పిన వారిని కూడా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు చలపతి రావు. శయనేషు రంభ అనే మాటకు అర్థాన్నే కదా నేను చెప్పింది. ఒకవేళ అది తప్పయితే మరోసారి క్షమాపణలు కోరుతున్నానంటూ వెల్లడించారు చలపతి రావు.