గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 21 డిశెంబరు 2017 (14:19 IST)

నాకు అన్ని అలవాట్లున్నాయ్, ఎవరికి లేవు.. క్రిష్ణ భగవాన్ వ్యాఖ్యలు

నా అసలు పేరు పాపారావు చౌదరి. అందరికీ క్రిష్ణభగవాన్ గానే పరిచయం. నాకు అన్ని అలవాట్లున్నాయి. ఎవరికి ఏ అలవాట్లు లేవో చెప్పండి.. ఇదంతా మామూలే.. ఒకప్పుడు చెడు అలవాట్లే నాకు చాలా ఎక్కువగా ఉండేవి. సినీ పరిశ్రమలోకి వచ్చిన తరువాత అలవాట్లను బాగా తగ్గించుకున్నా

నా అసలు పేరు పాపారావు చౌదరి. అందరికీ క్రిష్ణభగవాన్ గానే పరిచయం. నాకు అన్ని అలవాట్లున్నాయి. ఎవరికి ఏ అలవాట్లు లేవో చెప్పండి.. ఇదంతా మామూలే.. ఒకప్పుడు చెడు అలవాట్లే నాకు చాలా ఎక్కువగా ఉండేవి. సినీ పరిశ్రమలోకి వచ్చిన తరువాత అలవాట్లను బాగా తగ్గించుకున్నాను. అలాగని మానుకోలేదు. మానుకోలేనేమో కూడా.
 
నాటకాలంటేనే నాకు ఇష్టం. ఇప్పటికీ నాటకాలు ఎవరైనా వేస్తున్నారని తెలిస్తే ముందు వెళ్ళి కూర్చుండి చూస్తుంటాను. మా ఊర్లో నాటకాలు వేయడంలో నేనే ఫస్ట్. నన్ను నాటకాల పాపరావు అని పిలిచేవారు. అలా పిలిస్తే నాకు బాగా ఇష్టం. ఊర్లో వారందరూ నన్ను ఇప్పటికీ నాటకాలే వేయమంటారు. సినిమాల్లోకి వచ్చిన తరువాత ఊరి వారికి దూరమైపోయాను. అది తలుచుకుంటే ఇప్పటికీ బాధేస్తోంది అని ఒక టివి ఇంటర్వ్యూలో క్రిష్ణ భగవాన్ చెప్పారు.