శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 నవంబరు 2021 (13:44 IST)

నటి షాలు చౌరాసియా పెదాలు, మెడపై గాయాలు: అక్కడ సైకోలున్నారు జాగ్రత్త

నటి షాలు చౌరాసియాపై దాడి విషయంలో మరిన్ని వివరాలు వెలుగుచూసాయి. ఆదివారం రాత్రి షాలు చౌరాసియాపై పార్కులో దాడి చేసిన వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నటి పెదవులు, మెడపై గాయాలున్నట్లు గుర్తించారు.

 
ఆమెను దుండగుడు పొదల చాటుకి తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో కాలిమడమ ఫ్రాక్చర్ అయినట్లు అనుమానిస్తున్నారు. ఆమెపై దాడికి దిగిన వ్యక్తి సైకో అయ్యుంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 
మరోవైపు పార్క్ వద్ద స్టార్ బక్స్ ఎదురుగా ఘటన జరిగిన స్థలం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేస్తున్నారు.