శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (09:19 IST)

నటి చౌరాసియాపై దాడికి తెగబడిన దుండగుడు

హైదరాబాద్ నగరంలో ఉన్న పార్కుల్లో కేబీఆర్ పార్కు ఒకటి. ఉదయం పూట అనేక మంది వీవీఐపీలు ఈ పార్కులోనే వాకింగ్ చేస్తుంటారు. దీంతో భద్రత కూడా బాగానే ఉంటుంది. అలాంటి ప్రాంతంలో నటి చౌరాసియాపై ఓ దండుగుడు దాడికి పాల్పడ్డాడు. 
 
బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ రోడ్‌ నంబర్‌ 9 వద్ద నటి చౌరాసియాపై గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం రాత్రి దాడిచేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చౌరాసియాకు గాయాలయ్యాయి. కాగా, దుండగుడు ఆమె సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు.
 
ఆమె డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఆమెను సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో వాకింగ్‌ వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.