సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (11:04 IST)

మొన్న బీరు.. ఈసారి గుడ్లు... కేసు పెడతామని బెదిరింపులు

మొన్నీమధ్య బాత్ టబ్‌లో ఐస్ ఛాలెంజ్, బీర్ ఛాలెంజ్ పేరుతో హాట్ హాట్ వీడియోలు చేసిన తెలుగు యాంకర్ అండ్ మోడల్ శ్రావ్య రెడ్డి ఈసారి కోడిగుడ్ల ఛాలెంజ్‌తో ముందుకొచ్చింది. ఈ వీడియోలో ఆమెతో పాటు సోదరి విదా చైతన్య కూడా పాల్గొనడం విశేషం. ఇప్పటికే ఆమె విడుదల చేసిన ఐస్ ఛాలెంజ్, బీర్ ఛాలెంజ్‌కు యూత్‌లో మంచి స్పందన లభించడంలో ఈసారి వినూత్నంగా ఆలోచించి కోడిగుడ్లతో వీడియో చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. అయితే ఈ వీడియో వలన మంచి జరగడం అటుంచి విమర్శల పాలైంది.
 
శ్రావ్యా రెడ్డి 300 కోడి గుడ్లలోని కంటెంట్‌ను తీసుకుని, బాత్ టబ్‌లో సోదరితో కలిసి మీద పోసుకుని ఇద్దరూ కలిసి రచ్చరచ్చ చేసారు. అయితే తినే వస్తువులను ఇలా వృథా చేయడంపై కొందరు మండిపడ్డారు. ఇలా ఆహార పదార్థాలను వేస్ట్ చేయడం ఎందుకు, బాగా మరిగిన నీళ్లలో బాత్ టబ్ ఛాలెంజ్ చేయండంటూ సలహాలు ఇచ్చారు. 
 
మరోసారి ఇలా ఫుడ్ ఐటెమ్స్ వేస్టే చేస్తూ ఏవైనా వీడియోలు చేస్తే కోర్టులో కేసు పెడతామంటూ బెదిరించారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం ఈ వీడియో అద్భుతంగా ఉందంటూ, ఈసారి తేనెలో ట్రై చేయమంటూ ప్రశంసించడం గమనార్హం. ఈ వీడియోకు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఆమె నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు నెటిజన్లు.