శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (18:13 IST)

చెల్లెల్లు కలలో కనిపిస్తే..?

చెల్లెలతో పోట్లాడినట్లు కలవస్తే.. ఆనందం కలుగుతుంది. అక్క కలలో కనపడినట్లైతే ఆనందం కలుగుతుంది. ఆమె ఎదురుగా వస్తే సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. పినతండ్రి కలలో కనబడితే కోర్టు వ్యవహారములు పరిష్కారములై కేసులలో విజయము సాధించగలరు. పినతల్లి కలలో కనపడితే కీర్తి ప్రతిష్టలు, అన్నం పెట్టినట్లు కలవస్తే.. ధనలాభము, దీవించినట్లయిన శుభవార్తలు వింటారు.
 
పెత్తల్లి కలలో కనపడిన వారికి స్థాన చలనం తప్పదు. పెత్తండ్రి కలలో కనిపించిన విందు భోజనం లభించగలదు. మనమడు కలలో కనిపించిన మీ ఆస్తిని అందరికి పంచవలసి రావచ్చును. నవ్వితే శుభవర్తమానం అందుతుంది. మనమరాలు కలలో కనిపించినట్లైతే మీకు అన్ని విధాల విజయం పొందగలరు. పోట్లాడినట్లు కలవస్తే మృత్యువు ఆసన్నమయినట్లు గ్రహించాలి. అన్నం పెట్టినట్లైతే దీర్ఘాయువులయ్యెదరు.